LATEST NEWS

ఈత సరదా విషాదంగా మారకూడదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరిక

By SUNCHU SURESH • 2026-04-22 12:45 • 4 views   Share WhatsApp Share Facebook Share X
ఈత సరదా విషాదంగా మారకూడదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరిక

జిల్లా:
వేసవి సెలవుల సందర్భంగా పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, కుంటల వద్ద ఈతకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

ఈత సరదాగా ఉండాల్సిన సందర్భాలు కొన్ని నిర్లక్ష్యాల వల్ల విషాదంగా మారుతున్నాయని ఆయన తెలిపారు. ఈత రాని వారు బావులు, చెరువుల వద్ద ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలను నీటి వనరుల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందున, పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎస్పీ సూచించారు.

మైనర్‌లకు వాహనాలు ఇవ్వకండి

జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు అనుభవం లేకుండా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.

ఇలాంటి ఘటనల్లో కేవలం మైనర్‌లకే కాకుండా ఇతరులకు కూడా ప్రాణాపాయం ఏర్పడుతుందని, రెండు కుటుంబాలు నష్టపోయే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. కాబట్టి తల్లిదండ్రులు మైనర్‌లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.

మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన సందర్భాల్లో లేదా ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.