LATEST NEWS

జగిత్యాలలో కేంద్ర విద్యాలయం అంశంపై బీజేపీ-ఎమ్మెల్యే మధ్య రాజకీయ విమర్శల

By SUNCHU SURESH • 2026-05-14 16:01 • 3 views   Share WhatsApp Share Facebook Share X
జగిత్యాలలో కేంద్ర విద్యాలయం అంశంపై బీజేపీ-ఎమ్మెల్యే మధ్య రాజకీయ విమర్శల

జగిత్యాల: జగిత్యాలలో కేంద్ర విద్యాలయం ఏర్పాటు విషయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌పై బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ భోగ శ్రావణి విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్ర విద్యాలయానికి భూమి కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని ఆమె ఆరోపించారు.

జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన భోగ శ్రావణి, విద్యార్థులకు సీబీఎస్సీ విద్య అందుబాటులోకి రావడానికి కేంద్ర విద్యాలయం అవసరమని పేర్కొన్నారు. ఈ పాఠశాల కోసం వెంటనే 10 ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర విద్యాలయం మంజూరైందని, దీనిని త్వరగా అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 18న జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట “ధర్మ దీక్ష” చేపట్టనున్నట్లు ప్రకటించారు.

అయితే, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు స్పందించారు. కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు తాము మద్దతుగా నిలుస్తామని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళా మోర్చా నాయకులు మరియు ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.