LATEST NEWS

BJP Holds Meeting in Rajanna Sircilla as Part of Dr. B.R. Ambedkar Birth Anniversary Celebrations

By SUNCHU SURESH • 2026-04-20 22:29 • 3 views   Share WhatsApp Share Facebook Share X
BJP Holds Meeting in Rajanna Sircilla as Part of Dr. B.R. Ambedkar Birth Anniversary Celebrations
BJP Holds Meeting in Rajanna Sircilla as Part of Dr. B.R. Ambedkar Birth Anniversary Celebrations డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఇంచార్జ్ శ్రీ గంగాడి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా దేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను స్థాపించడంలో అంబేద్కర్ గారి పాత్ర అమూల్యమని తెలిపారు. అంబేద్కర్ గారి పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని విమర్శిస్తూ, ఆయనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. అంబేద్కర్ గారు ప్రతిపాదించిన పలు సంస్కరణలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. దేశానికి చేసిన అపార సేవలకు తగిన గుర్తింపు ఆలస్యంగా లభించిందని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆలోచనలకు గౌరవం ఇచ్చే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. అంబేద్కర్ గారి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా స్మారక స్థలాల అభివృద్ధి చేపట్టడం, నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. “సబ్కా సాథ్, సబ్కా వికాస్” నినాదంతో అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలో చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ గారి ఆలోచనలను తెలుసుకొని సమాజ నిర్మాణంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, అల్లాడి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లరపు సంతోష్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఆసానీ రామలింగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజాసింగ్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి పల్లం అన్నపూర్ణ తదితర జిల్లా నాయకులు పాల్గొన్నారు. అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.